ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్`

0
353
Sreemukhi Next Crazy Uncles telugu movie cast, news, release date

పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా `క్రేజీ అంకుల్స్ ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీముఖి, మనో, భరణి, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‌ ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.కాగా ‌ ఈ చిత్రం చిత్రీకరణ ఒక పాట మిన‌హా పూర్తయింది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లొకేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ద‌ర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ, “ఈ చిత్రం చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. కుటుంబ కథతో మలుస్తున్నాం..షూటింగులో సన్నివేశాలు తీస్తున్నప్పుడు యూనిట్ అంతా ఎంతో ఎంజాయ్ చేశాం, విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా అంతే స్థాయిలో ఎంజాయ్ చేయడం ఖాయం “ అని అన్నారు.

గాయకుడు మ‌నో మాట్లాడుతూ `ఈ చిత్రంలో ఓ చక్కటి వినోదాత్మక పాత్రలో నటించాను. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగింది. .కుటుంబ సభ్యులంతా ఆహ్లాదంగా ఆద్యంతం నవ్వుతూ చూసే సినిమా ఇది. నిర్మాత శ్రీవాస్ ముందు ముందు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలి“ అని అన్నారు

న‌టుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, “ఇందులో యోగ టీచర్ గా కనిపిస్తాను . కరోన సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న నటీనటులకు గుడ్ సినిమా గ్రూప్ వారు ఈ సినిమా ద్వారా పని కల్పించడం ఆనందదాయకం“ అని పేర్కొనగా…

Sreemukhi Next Crazy Uncles telugu movie launch

న‌టి శ్రీముఖి మాట్లాడుతూ , “బుల్లి తెరపై ఎక్కువ షోస్ చేస్తున్న నేను ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.

నిర్మాత‌ శ్రీవాస్ మాట్లాడుతూ – “రచయిత డార్లింగ్ స్వామి చెప్పిన పాయింట్ నచ్చి, శ్రేయాస్ శ్రీనివాస్ తో కలసి ఈ చిత్రం తీస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని చేసిన చిత్ర‌మిది. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో ఇలా అందరి దర్శకుడు సత్తిబాబు ప్రతీ సన్నివేశాన్ని ఎంతో బాగా మలిచారు“ అని అన్నారు.

Sreemukhi Next Crazy Uncles telugu movie launch

న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ , `ఇటీవల కాలంలో నేను చేసిన పూర్తి ఎంటర్టైనర్. కథ గురించి వింటున్నప్పుడే ఎంతో హాయిగా నవ్వుకున్నాను. కుటుంబమంతా కలసి చూడదగ్గ సినిమా ఇది“ అని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో, హేమ, అదుర్స్ రఘు, గాయత్రి భార్గవి, గిరిధర్, విజయమూర్తి, వాజ్పై, సిందూరి, మాధురి, మహేంద్ర నాథ్ త‌దిత‌రులు తారాగణం. ఈ చిత్రానికి. కథ, మాటలను డార్లింగ్ సామి,సినిమాటోగ్రఫీని పి. బాలరెడ్డి, సంగీతాన్ని రఘు కుంచె,ఎడిటింగ్ ను నాగేశ్వర రెడ్డి అందిస్తున్నారు.

Previous articleHyderabad Girl Amrin Qureshi Starring In Two Big Bollywood Films
Next articleAllu Arjun’s shooting pic from ‘Pushpa’ set gets leaked