Homeసినిమా వార్తలుBSS10: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త సినిమా

BSS10: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త సినిమా

Sreenivas Bellamkonda new movie under Saagar K Chandra direction. BSS10 movie announced officially, Sreenivas Bellamkonda new movie and upcoming movies list

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ డిఫరెంట్ జోన్ లో వున్నారు. వైవిధ్యమైన థీమ్ లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఇది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రపతి తర్వాత అతని తదుపరి చిత్రాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.

#BSS10 చిత్రం మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని గొప్ప నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది, #BSS10 పై క్యురియాసిటీని జనరేట్ చేస్తుంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY