కంగనాపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. !

0
590
Sri Reddy Shocking Comments On Kangana Ranaut And Trolled By Netizens

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) షాకింగ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్న రచ్చను మరింత పెద్దది చేసింది శ్రీ రెడ్డి (Sri Reddy). ఆమెపై నోరుపారేసుకొని నెటిజన్ల ఆగ్రహానికి గురైంది ఈ సెక్సీ బాంబ్. బాలీవుడ్‌లో నెపోటిజం మొదలుకొని డ్రగ్స్ ఇష్యూ వరకూ అన్నింటిపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ముంబై నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని తపిస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుంచి కంగనా రనౌత్ ప్రతీ విషయంలోనూ ముందు ఉంటోంది. మొదట్లో నెపోటిజంపై టార్గెట్ చేస్తూ బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఆ తరువాత డ్రగ్స్ మాఫియా గుట్టు బయట పెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇక రీసెంట్‌గా శివసేన మంత్రి సంజయ్ రౌత్‌తో ఢీ కొడుతోంది.

ముంబై పోలీసులపై కంగన చేసిన విమర్శలను తప్పుపడుతూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఓ పత్రికలో సంపాదకీయం రాయడం, ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టకు. ఒకవేళ పెడితే రాళ్లతో కొడతాం అంటూ బహిరంగ ప్రకటన చేయడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బెదిరింపులకు తాను బయపడటంలేదని పేర్కొంటూ ముంబై నగరం ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా.. వస్తున్నా.. దైర్యం ఉంటే ఆపండి అని సవాల్ విసిరింది కంగనా.

ఓ వైపు వారిద్దరి మధ్య మాటల పోరు జరుగుతూ ఉంటే..శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. కంగనాకు తల పొగరు ఎక్కువ, ఆమె వరెస్ట్.. మహారాష్ట్ర ద్వారానే క్రేజ్,కోట్లు , అభిమానుల ప్రేమను సంపాదించుకుంది.. ఐ లవ్ ముంబై అంటూ కంగనాపై నోరుపారేసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ పోస్ట్‌కు అన్నీ నెగెటివ్ కామెంట్సే వస్తున్నాయి.

కంగనాకు కామెంట్స్ చేసేంత పెద్ద దానివయ్యావా? అంటూ శ్రీ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. బాలీవుడ్ ఇష్యూస్‌లో కూడా వేలు పెట్టడం నీకు అవసరమా? అంటూ ఆమెను ఏకిపారేస్తున్నారు.