Sri Reddy Targets Pawan kalyan Over Disha murder Accused
Sri Reddy Targets Pawan kalyan Over Disha murder Accused

దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద, ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఘటనపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. న్యాయం జరిగిందని వ్యాఖ్యలు చేశారు.

ఇక శ్రీరెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ‘మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పీకే లాంటి వాళ్లను కూడా తెలంగాణ పోలీసుల మాదిరే ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని’ సంచలన పోస్ట్ పెట్టింది. పీకే అని శ్రీ రెడ్డి అన్నప్పటికీ.. అది పక్కా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి పెట్టిన పోస్టు అని అందరూ అంటున్నారు.

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని అనుకోవద్దని, మహిళలపై దారుణాలకు పాల్పడే మృగాళ్లను వదిలిపెట్టకూడదని అన్నారు. కోర్టులపరంగా తక్షణ న్యాయం లభించాలని.. కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని పవన్ అన్నారు. గతంలో నిర్భయ ఘటన తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్‌ తీసుకొచ్చినప్పటికీ అత్యాచారాలు ఆగలేదని అన్నారు. మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అమ్మాయిల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాలని ఆయన అన్నారు.