శ్రీ సింహా ‘తెల్లవారితే గురువారం’ టీజర్

376
Srisimha-tellavarite-guruvaram-teaser-unveiled-by-varun-tej
Srisimha-tellavarite-guruvaram-teaser-unveiled-by-varun-tej

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న సినిమా తెల్లవారితే గురువారం. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈరోజు మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ ప్రకారం చూస్తే.. సినిమాలో శ్రీసింహ పెళ్లికి సిద్దంగా ఉంటాడు. కానీ పెళ్లి చేసుకోవడం అతడికి ఇష్టం ఉండదు.

 

 

ఎందుకంటే అతడికి అంతకుముందు ఉన్న లవ్ స్టోరీనే కారణం. తన కథను ప్రస్తుతం పెళ్లి కూతురుకి వినిపిస్తారు. మరి శ్రీసింహ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేది సినిమా కథగా అర్థం అవుతోంది. ఈ సినిమా చూడాలన్న అంచనాలను ఈ టీజర్ మరింత ఎక్కువ చేస్తుంది. ఈ చిత్రంలో చిత్ర షుక్ల, మిషా నారంగ హీరోయిన్‌లుగా నటించారు. ఈ  సినిమాను గాలి మణికాంత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.