SS Rajamouli Comments on RRR Release Date Delay

RRR Update: డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బడా స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

బాహుబలి తర్వాత మళ్ళీ అదే రేంజ్ ప్యాన్ ఇండియా మూవీ RRR రూపొందిస్తున్న రాజమౌళి.. ప్రతి సన్నివేశాన్ని, కెమెరాలో బంధించే ప్రతి సెకనునూ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారట. ఒక్క షాట్ కోసం దాదాపు నాలుగైదు గంటల సమయం తీసుకుంటునట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 75 శాతం షూటింగ్ ఫినిష్ అయిందని చెప్పుకుంటున్నా. మేకింగ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గని రాజమౌళి.. RRR విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో అనుకున్న సమయానికి జక్కన్న రూపొందిస్తున్న RRR రిలీజ్ కాకపోవచ్చనే అనుమానాలు రేకెత్తాయి. లేటెస్ట్ సమాచారం మేరకు రాజమౌళి అస్సలు వెనక్కి తగ్గడం లేదని, ఎంత ఆలస్యమైనా తాను అనుకున్నట్లుగా అవుట్‌పుట్ రావాల్సిందే అని పట్టుబట్టుకు కూర్చున్నట్లు టాక్.