Homeట్రెండింగ్షూటింగ్ కంటే ముందే వరల్డ్ వైడ్ కాక పుట్టిస్తున్న SSMB29.

షూటింగ్ కంటే ముందే వరల్డ్ వైడ్ కాక పుట్టిస్తున్న SSMB29.

SS Rajamouli is planning to shoot SSMB29 in english version Details, Mahesh Babu, SS Rajamouli, SSMB29 Launch date, SSMB29 story line, SSMB29 script work, SSMB29 Shooting update

SSMB29 shoot in English language: మూవీ హిట్ …లేక ప్లాప్ అనే విషయంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో క్రేజ్ తగ్గకుండా దూసుకు వెళ్లే నటుడు మహేష్ బాబు (mahesh babu). ప్రస్తుతం అతను రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎంబీ 29 మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. మరోపక్క మహేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రెడీ అవుతున్న గుంటూరు కారం చిత్రం అతని అభిమానులకు మంచి మాస్ ట్రీట్ అందివ్వబోతోంది.

SSMB29 shoot in English language: అయితే రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో వస్తున్న చిత్రం కి పాన్ ఇండియా రేంజ్ను దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ ని ఏకంగా హాలీవుడ్ లోనే దించేస్తారా అన్న డౌట్ ఓ చిన్ని పుకారు రూపంలో సినీ ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. కొందరైతే ఇది కన్ఫామ్ అని చిలక జోస్యం కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహేష్ కి (Mahesh babu) ఉన్న క్రేజ్ ని కరెక్ట్ యాంగిల్ లో ఉపయోగిస్తే పాన్ వరల్డ్ షేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అనేది రాజమౌళి రఫ్ ఐడియా.

మళ్లీ హాలీవుడ్ అంటే షూటింగ్ కోసం లాస్ ఏంజెల్స్ కి వెళ్లాల్సిన పనిలేదు. ఇండియా నుంచి అటువంటి వండర్స్ క్రియేట్ చేయడం కుదరదా? అన్న జక్కన్న కొత్త ఆలోచన నుంచి వచ్చిన మైండ్ బ్లోయింగ్ ఐడియా ఇది అని టాక్. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కొత్తగా ఇంగ్లీషులో కూడా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు ఆరంభమైన కొత్తల్లో మహేష్ను (Mahesh Babu) గ్లోబల్ స్టార్ గా ఆవిష్కరిస్తామని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత తిరిగి ఈ విషయంపై ఎటువంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా వస్తున్న లీకులు చూస్తుంటే మహేష్ను నిజంగా ఆ రేంజ్ లో నిలబెట్టే వరకు జక్కన్న రెస్ట్ తీసుకునేలా లేడు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం హాలీవుడ్ లోని ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లను నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

SS Rajamouli is planning to shoot SSMB29 in english version

ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ అయిన ఈ చిత్రం కోసం ఇండియాతో పాటుగా వివిధ దేశాలలో షూటింగ్స్ జరిగే అవకాశం ఉంది. అయితే సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం ఆఫ్రికన్ అడవుల్లో మరి కొంత భాగం అమెజాన్ ఫారెస్ట్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కి గ్లోబల్ చుట్టేసిన చిత్రం కచ్చితంగా గ్లోబల్ మూవీ గా టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరి.

SS Rajamouli is planning to shoot SSMB29 in english version Details, Mahesh Babu, SS Rajamouli, SSMB29 Launch date, SSMB29 story line, SSMB29 script work, SSMB29 Shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY