బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్‌ చేసిన రాజమౌళి

0
55
SS Rajamouli launches Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake

Chatrapathi Remake Launch: అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్.. ఈరోజు శుక్రవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభించారు.

రాజమౌళి క్లాప్ కొట్టగా.. రమా రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్ట్ ను విజయేంద్ర ప్రసాద్ మేకర్స్ కు అందించగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్‌ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. ఇక టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్.. ఈ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు.

ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్ డైరెక్టర్ జయంతిలాల్ గడ మాట్లాడుతూ.. “టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు పాపులర్ డైరెక్టర్ వివి వినాయక్ లతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. భారతీయ సినిమాల్లో చరిత్ర సృష్టిస్తుందని మాకు నమ్మకం ఉంది” అన్నారు.

Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake Launch photos

ఈ చిత్రానికి ‘భలే భలే మగాడివోయ్’ ‘మహనుభవుడు’ ఫేమ్ నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ అందించగా.. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ తనీష్ బాగ్చి సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ అరుసు యాన్ కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తారు. ‘మహర్షి’ ‘గజినీ’ ‘స్పెషల్ 26’ వంటి చిత్రాలకు వర్క్ చేసిన సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్ గా చేస్తున్నారు. మయూర్ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ‘రంగస్థలం’ విలేజ్ సెట్ వేసిన ప్రదేశంలో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మించబడింది. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake Launch photos Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake Launch photos Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake Launch photos

 

Previous article‘నవరస’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేసిన ‘నెట్‌ఫ్లిక్స్‌’
Next articleBellamkonda Sreenivas’s Chatrapathi Hindi remake launched