‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!

0
111
SS Rajamouli RRR movie postponed once again

RRR Movie Release date: రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) కాంబోలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ (RRR Movie) మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమాని ఎట్టి పరిస్తితుల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13 నే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా రాజమౌళితో పాటు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఆగష్టు ఫస్ట్ వీక్ వరకు ప్రకటిస్తూ వచ్చారు.

కరోనా పాండమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రకటించినా అది సాధ్యం కావటం లేదు. రీ-షూట్ చేస్తున్నారు… గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదు అంటూ పలు రకాల ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ వస్తోంది.

తాజాగా అధికారికంగా కూడా ఆ ప్రకటన వచ్చేసింది. వరల్డ్ వైడ్‌గా థియేటర్స్ అన్ని ఇంకా పూర్తి సామర్థ్యంతో ఓపెన్ కాని నేపథ్యంలో అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు.

SS Rajamouli RRR movie postponed once again

ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్, పాటలు, మేకింగ్ వీడియోస్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం. ఈ సినిమాలో కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు.