RC15: బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌లోకి తమన్‌ ఎంట్రీ

0
294
SS Thaman on board for Ram Charan and Director Shankar's movie RC15

RC15: SS Thaman: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీకి మోస్ట్‌ హ్యపెనింగ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్‌ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి.

శంకర్‌ రూపొందించిన ‘బాయ్స్‌’ సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురుచూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన ‘వైశాలి'(ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం.

“శంకర్‌గారు నిర్మించిన ‘వైశాలి'(ఈరం)కి ట్యూన్స్‌ ఇచినప్పుడు, ఆయన తొలి వెంటనే మ్యూజిక్‌ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది” అని తమన్ గుర్తు చేసుకున్నారు.