ప్రముఖ దర్శకుడు రాజమౌళి, రమా దంపతులకు వ్యక్తిగత జీవితంలో ప్రమోషన్ రాబోతోంది. వీరి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ వివాహం జగపతిబాబు అన్న రాంప్రసాద్ కుమార్తె పూజతో 2018లో జరిగింది.
పెద్దల అంగీకారంతో రాజస్థాన్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఈ ప్రేమజంట ఒక్కటయ్యారు. కార్తికేయ సినిమా నిర్మాణం, ప్రొడక్షన్స్ వ్యవహారాలతో బిజీగా ఉంటే… పూజ గాయనిగా చక్కని పేరు తెచ్చుకుంది. నిజానికి త్వరలో విడుదల కాబోతున్న ‘ఆకాశవాణి’ సినిమాకు కార్తికేయ నిర్మాణ భాగస్వామిగా ఉండాల్సింది కానీ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుండి అతను బయటకు వచ్చాడు.
ఆ సంగతి అలా ఉంచితే.. తాజాగా కార్తికేయ, పూజ జంట త్వరలో పేరెంట్స్ హోదా పొందబోతున్నారట. సో… ఆ రకంగా చూసినప్పుడు రమా, రాజమౌళి దంపతులు నానమ్మ, తాతయ్యలుగా మారినట్టే కదా! అతి త్వరలోనే వారి ఇంట బాబు లేదా పాప ముసిముసి నవ్వులు వినిపించబోతున్నాయి.