రివ్యూ: స్టాండ‌ప్ రాహుల్‌

Stand Up Rahul telugu Review & Rating

రేటింగ్ 2.5/5
నటీనటులు రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళీ శర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్
దర్శకత్వం శాంటో
నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి

 

Stand Up Rahul Review: టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ చేసే ప్రతి ఒక్క సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. హిట్ అలాగే ఫ్లాపులతో సంబంధం లేకుండా తరుణ్ సినిమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు రాజ్ తరుణ్ స్టాండ‌ప్ రాహుల్‌ అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈరోజు రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

కథ :
రాహుల్(రాజ్ తరుణ్) తన తల్లి(ఇంద్రజ) ఆమె భర్త అయినటువంటి(మురళీ కృష్ణ) నుంచి వేరై సెపరేట్ గా తమ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఉద్యోగం చేయమని తల్లి చెప్పడంతో ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) కంపెనీలో చేరతాడు. అక్కడ స్కూల్ మేట్ శ్రేయా రావు (వర్షా బొల్లమ్మ) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ సహ జీవనం కొనసాగిస్తున్నా వీళ్ళ జీవితంలో లో ఎటువంటి మార్పులు వచ్చాయి> రాహుల్ కి పెళ్లి పట్ల ఉద్దేశం ఏమన్నా మారుతుందా? రాహుల్ తన లైఫ్ లో పెట్టుకున్న స్టాండప్ కమెడియన్ గోల్ సాధించాడా లేదా అనేవి తెలియాలి అంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.

Raj Tarun Stand Up Rahul Review in Telugu
Raj Tarun Stand Up Rahul Review in Telugu

పాజిటివ్ పాయింట్స్:
సినిమా టైటిల్ కి అలాగే స్టోరీ కి సంబంధం లేకుండా ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. గత సినిమాల కంటే రాస్తారు ఈ సినిమాలో తన నటన ప్రభావాన్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నాడని తెలుస్తోంది. అలాగే తనకి మడీ టైమింగ్ తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టవ్వడమే కాకుండా తన మాడ్యులేషన్స్ కూడా బాగా పలికించాడు.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే వర్ష బొల్లమ్మ గురించి మనం సపరేటు గా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ వర్ష మంచి రోల్ లో కనిపించింది ఈ సినిమాలో. రాజ్ తరుణ్ కి రోల్ కి తగ్గట్టుగా సేమ్ ఏజ్ గ్రూప్ లో కనిపించి మంచి కెమిస్ట్రీ తో ఆకట్టుకుంటుంది.

- Advertisement -

నిజం చెప్పాలంటే… సినిమాలో స్టాండప్ కామెడీకి మించిన మెటీరియల్ ఉంది. స్టాండప్ కామెడీ అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే! సినిమాలో హీరో ఇష్టపడే ప్రొఫెషన్ అంతే! అసలు కథ వేరే ఉంది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుంది? అనేది చూపిస్తూ… రూపొందిన చిత్రమిది. అలాగే మరో ప్రధాన పాత్రలు ఇంద్రజ మరియు మురళీ శర్మ తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.

Stand Up Rahul movie review in telugu
Stand Up Rahul movie review in telugu

మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సినిమాలో ఎంచుకున్న లైన్ కి తగ్గట్టుగా ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు కానీ అవి అంత టచ్ అయ్యే రీతిలో అనిపించవు. క్లైమాక్స్ అయితే మరీ రొటీన్. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో అటువంటి క్లైమాక్స్ చూశాం.

అలాగే హీరో పాత్ర డెవలప్మెంట్ లో కూడా లోపాలు కనిపిస్తాయి. పెళ్లి పట్ల ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టుకున్న రాహుల్ తర్వాత హీరోయిన్ తో తీసుకునే స్టెప్స్ లో లాజిక్ మిస్ అయ్యింది. అలాగే మెయిన్ లీడ్ లో చాలా వరకు రొమాన్స్ కూడా అప్ టు మార్క్ ఆకట్టుకోకుండా సోసో గానే ఉంటుంది.

మంచి కామెడీ టైమింగ్ ఉన్న యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఆయన టైమింగ్ కూడా నవ్వించలేదంటే… డైలాగులు, కామెడీ సన్నివేశాలు ఎంత వీక్ అనేది అర్థం చేసుకోవచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా వర్కవుట్ కాలేదు.

తీర్పు :
డైరెక్టర్ తీసుకున్న కథ మంచిదే అయినా దాన్ని చూపించే విధానంలో లోకం కనబడటం సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. రొటీన్ కథ, కామెడీ లేకపోవడంతో ప్రేక్షకుల సహనాన్ని ‘స్టాండప్ రాహుల్’ పరీక్షిస్తుంది. సినిమాలో సరైన ఎమోషన్స్ మరియు డెప్త్ లేకపోవడం డల్ గా ఉండే నరేషన్ అంత ఇంపాక్ట్ ని ఈ సినిమాలో కలిగించలేకపోయాయి. ఖాళీగా ఉన్న టైంలో ఈ సినిమాని ఒక్కసారి వెళ్లి చూసి రావచ్చు ఇది మా అభిప్రాయం.

Related Articles

Telugu Articles

Movie Articles