ఈ ఫోటోలో హీరో కార్తీ ఉన్నాడు గుర్తుపట్టగలరా ?

0
330
star-hero-karthi-shared-his-college-days-photo-travelled-in-government-bus
star-hero-karthi-shared-his-college-days-photo-travelled-in-government-bus

ఎంతటి స్టార్ హీరో అయినా.. తన చిన్ననాటి స్మృతులను, టీనేజ్ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేరు. అందులోనూ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసిన రోజులకు సంబంధించిన అనుభవాలు ఎప్పటికప్పుడు కళ్ల ముందుకు కదులుతుంటాయి. అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ఉంటే… ఒకసారి ఆ కాలంలోకి వెళ్లిరావచ్చు.

 

 

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ కూడా అలాగే చేశాడు. సీనియర్ నటుడు శివకుమార్ కుమారుడు, స్టార్ హీరో సూర్య తమ్ముడైన చెన్నైలోని బీఎస్‌పీపీ స్కూల్‌లో స్కూలింగ్, క్రెసెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో బస్సులోనే కాలేజీకి వెళ్లే కార్తీ.. వారిలో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాడు.

 

 

తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను కార్తీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. చెన్నైలోని పల్లవన్ తనకు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడన్న కార్తీ.. తన కాలేజీ రోజుల్లో ఎక్కువగా ఆ బస్సులోనే గడిపానని తెలిపాడు. కార్తీ పోస్ట్ చేసిన ఈ ఫోటోకు సినీ ప్రియులు, అభిమానులు లైకులు కొడుతున్నారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కార్తీ.. ఆ తరువాత పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాడు.

 

star-hero-karthi-shared-his-college-days-photo-travelled-in-government-bus
 

 

 

View this post on Instagram

 

A post shared by Karthi Sivakumar (@karthi_offl)