‘పుష‍్ప’ షూటింగ్‌లో స్టిల్ ఫోటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి

0
156
still-photographer-g-srinivas-died-in-pushpa-shooting-set-in-maredumilli
still-photographer-g-srinivas-died-in-pushpa-shooting-set-in-maredumilli

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ సినిమా పుష్ప. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  ఈ మూవీకి ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న  జి. శ్రీనివాస్ (54) మృతి చెందారు. ఇవాళ అర్థరాత్రి రాత్రి..

 

 

అంటే దాదాపు 1 గంటల ప్రాంతంలో రాజమండ్రిలో గుండెపోటుతో మరణించారు.  “పుష్ప” షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లికి శ్రీనివాస్ వెళ్లాడు. అయితే.. అతనికి ఒంట్లో బాగుండకపోవడంతో అంబులెన్స్ లో రాజమండ్రికి ఆయనను తరలించారు. కానీ శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే మరణించాడు. ఈ ఘటనతో టాలీవుడ్‌ విషాద ఛాయలోకి వెళ్లింది. శ్రీనివాస్ దాదాపు 200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమర్తెలున్నారు. ఆయన మృతికి పలుగురు సిని ప్రముఖులు సంతాపం తెలిపారు.

Previous articleఆగస్ట్ 27న ‘ఎఫ్3’ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
Next article‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్