Subhashree Rayaguru Eliminated 5th week From Bigg Boss Telugu 7, Bigg Boss Telugu 7 latest wild card entry contestants details, Hot Actress Nayani Pavani wild card entry, Bigg Boss 7 today promo review
బిగ్ బాస్ తెలుగు 7 – 5వ వారం చివరి దశకు చేరుకుంది. ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ లో హౌస్ లో ఉన్న ఏడుగురు నామినేట్ కాగా.. ఈ వారం ఓటింగ్ రిజల్ట్ ప్రకారము టేస్టీ తేజ, శుభశ్రీ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇద్దరిలో ఎవరు హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతున్నారు అలాగే బిగ్ బాస్ 2.0 (Bigg Boss 2.0) కొత్త వర్షన్ సంబంధించి హౌస్ లోకి ఎవరు రాబోతున్నారు అనేది చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ మొదటి దగ్గర నుండి నాగార్జున ఈ సీజన్ అంత హుల్టా ఫాల్టా ఉంటుంది అంటూ చెప్పుకోవచ్చారు. నాగార్జున చెప్పిన విధంగానే ప్రతివారం ఏదో ఒక ట్విస్ట్ అనేది బిగ్ బాస్ హౌస్ లో నడుస్తూనే ఉంది మరి ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూసుకుంటే హౌస్ లో ఏడుగురు నామినేట్ అవ్వడం జరిగింది. ఈ నామినేషన్ లో ఓటింగ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో టేస్టీ తేజ శుభశ్రీ అలాగే ప్రియాంక జైన్ ఉన్నట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం మేరకు శుభశ్రీ ఈవారం హౌస్ నుండి ఈవారం ఎలిమినేషన్ చేయటం జరిగిందంట. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా అలాగే మూడో వారం దామిని నాలుగో వారం రతిక ఇప్పుడు ఐదో వారం శుభశ్రీ హౌస్ నుండి బయటికి వెళ్లడం జరిగింది. బిగ్ బాస్ మొదటి వారం దగ్గర నుండి లేడి హౌస్ మేట్స్ ని ఎలిమినేషన్ జరుగుతూ వచ్చింది.
ఐదో వారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు లేటెస్ట్ గా 2.0 అంటూ కొత్త వర్షన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ వర్షంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి దాదాపు ఆరుగురు కొత్త హౌస్మేట్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వాటికి సంబంధించిన పేర్లు కూడా దాదాపు కన్ఫామ్ అయినట్టే చెబుతున్నారు అయితే సమాచార తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నాయని పావని హౌస్ లోకి రాబోతున్నట్టు సమాచారం. ఆమెతోపాటు మరో ఐదుగురు రాబోయే రోజుల్లో హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేదు అంటే ఈ రోజే అందరు ఎంట్రీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.