ముచ్చటగా మూడోసారి సుధీర్ బాబు..!

0
360
Sudheer Babu And Indraganti Mohana Krishna Paired up For Hat trick Movie

మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. తనదైన నటనా ప్రతిభతో మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన యంగ్ అండ్ డైనమిక్ హీరో మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో జత కట్టారు. వీరిద్దరి కాంబోలో రాబోయే మరో సినిమాను దీపావళి కానుకగా అఫీషియల్‌గా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో ”సమ్మోహనం, V” సినిమాలు వచ్చాయి. ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ‘భలే మంచి రోజు’ ‘భాగీ’ ‘శమంతకమణి’ ‘సమ్మోహనం’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు.

సుధీర్ బాబు కోసం వైవిద్యభరితమైన కథ రెడీ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ సినిమా రూపొందనుంది. చిత్రంలో సుధీర్ బాబు సరసన ‘ఉప్పెన’ ఫేమ్ క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనుండగా వివేక్ సాగర్ సంగీతం అందించబోతున్నారు.

దీపావళి పండుగ సందర్భాన్ని పురష్కరించుకుని ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు – కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలకు ఆ బాధ్యతలు అప్పగించారు. సుధీర్ బాబు కెరీర్‌లో 14వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రానుంది. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

Previous articleకంట్రోల్ చేసుకోమన్న రేణు దేశాయ్..!
Next articleSudheer Babu and Indraganti Hat trick combination again