రివ్యూ: శ్రీదేవి సోడా సెంటర్‌

0
6516
Sudheer Babu Sri Devi Soda Center Telugu Movie Review Rating

Sudheer Babu Sri Devi Soda Center Telugu Movie Review Rating 
రేటింగ్ : 3/5
నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది , ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌,న‌రేష్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేష్, హ‌ర్హ వ‌ర్ద‌న్‌, స‌ప్త‌గిరి, క‌ళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త త‌దిత‌రులు
దర్శకుడు: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం​ ‘శ్రీదేవి సోడా సెంటర్’. అమలాపురం బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమాకు ‘పలాస 1978’ డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించారు. ‘వి’ పరాజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ అంచనాలు ఎంత మేర అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ
సూరిబాబు (హీరో సుధీర్‌ బాబు) అమలాపురంలో ఎలక్ట్రీషియన్‌. ఓ గుడిలో లైట్‌ సెట్టింగ్‌ వేస్తున్న సమయంలో అక్కడ సోడాలు అమ్ముకునే శ్రీదేవి(ఆనంది)ని చూసి లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు.

Sudheer Babu Sri Devi Soda Center Telugu Movie Review Rating

దానికితోడు సూరిబాబును తక్కువ కులం అని వారి ప్రేమను భగ్నం చేయాలనుకుంటాడు. ఇంతలో ఆ గ్రామంలో హత్య జరుగుతుంది. దానికి సూరిబాబే కారణమని అతడిని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు జైలు నుంచి విడుదలయ్యాడా? అతడు జైలు నుంచి తిరిగొచ్చేలోపు శ్రీదేవి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో బొమ్మ చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్
సూరిబాబు
క్లైమాక్స్‌
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
రొటీన్‌ కథ

నటీనటులు:
సుధీర్‌ బాబు సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్రలో జీవించేశాడు. లవ్‌ సీన్లు, ఎమోషనల్‌ సీన్లలో ఇరగదీశాడు. హీరోయిన్‌ ఆనంది కూడా సుధీర్‌తో పోటీపడి మరీ నటించింది. నరేశ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వీరితో పాటుగా మెయిన్ విలన్ గా పరిచయం చేసిన నటుడు పవేల్ నవగీతన్ కూడా తన రోల్ లో మంచి ఇంటెన్స్ నటనను కనబర్చడం విశేషం.

Sudheer Babu Sri Devi Soda Center Telugu Movie Review Rating

అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో కనిపించిన సీనియర్ నరేష్ తన సీనియార్టీ మరోసారి కనబరిచారని చెప్పాలి. ఒక తండ్రిగా ఇది వరకు ఎన్నో చిత్రాల్లో కనిపించారు కానీ ఇది ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువ కలిగించేదిలా ఉంటుంది. సాలిడ్ ఎమోషన్స్, నెగిటివ్ షేడ్స్ లో తన వెర్సిటైల్ నటనతో తన రోల్ కి కంప్లీట్ జస్టిస్ చేకూర్చారు.

విశ్లేషణ:
సుధీర్‌ బాబు సిక్స్‌ప్యాక్‌ కోసం పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. అతడి పర్ఫామెన్స్‌ను, అప్పియరెన్స్‌ను అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు. ఇక కథ స్టార్ట్‌ అవడమే జైలు సన్నివేశంతో మొదలవుతుంది. తర్వాత వచ్చే బోట్‌ సీన్లు, ఫైటింగ్‌, బీజీఎమ్‌ ఓ లెవల్లో ఉంటాయి. పల్లెటూరి అందాలను తెరపై మనోహరంగా చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటెన్స్ ఎమోషన్స్ మరియు స్టోరీ ఎలా కనిపిస్తుందో అంతే సాలిడ్ గా నటీనటులు అద్భుత నటనను కనబరిచారు. ఎవరికి ఎవరూ కూడా తగ్గలేదని చెప్పొచ్చు.

Sudheer Babu Sri Devi Soda Center Telugu Movie Review Rating

ఈ చిత్రంలో డైరెక్టర్ ప్రాజెక్ట్ చేసిన ఎమోషన్స్ మరియు కథలో సహజత్వంతో రాబట్టిన పెర్ఫామెన్స్ లు మరింత ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కామెడీ, ప్రేమ కథతో ఫస్ట్‌ హాఫ్‌ అలా అలా సాగిపోతుంది. లవ్‌ స్టోరీ కొంత రొటీన్‌గా అనిపించక మానదు. పైగా కథలో పలు సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉండటం నెగెటివ్‌ అని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. శ్రీదేవిని విలన్‌కిచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. అయినప్పటికీ శ్రీదేవి అతడితో జీవించేందుకు అంగీకరించదు. హీరో రాక కోసం నిరీక్షిస్తుంది. అతడితో వెళ్లిపోవాలని డిసైడ్‌ అవుతుంది. ఈ క్రమంలో కథను ఊహించని మలుపు తిప్పుతాడు డైరెక్టర్‌.

Sudheer Babu Sri Devi Soda Center Telugu Movie Review Rating

ఈ చిత్రంలో అంతగా రుచించని భాగం ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఇది కొంచెం నెమ్మదిగా ఓ ఫ్లో లో సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తుంది. రొటీన్ యావరేజ్ గా సాగే సన్నివేశాలతో ఈ పార్ట్ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో హీరో తండ్రిగా ప్రముఖ నటుడు రఘు బాబు కనిపిస్తారు అతని పాత్ర నామ మాత్రంగానే కనిపిస్తుంది. తర్వాత ఇంపార్టెన్స్ కూడా కనిపించదు.

ఇక కథ చివర్లో వచ్చే క్లైమాక్స్‌ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది. సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడికే మరికొంత మసాలా వేసి జనాలకు వడ్డించాడు డైరెక్టర్‌. చిత్రంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి, అన్ని సన్నివేశాల్లో కూడా ఎక్కడా సహజత్వం మిస్ కాలేదు. ఇంటెన్స్ గా సాగే కథనం, అంతే అలరించే ఎమోషన్స్ ఆడియెన్స్ కి ఫ్రెష్ ఫీల్ అందిస్తాయి. ఒక్క ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ని ఈ వారాంతానికి అందిస్తుంది.