అదిరిపోయే గ్లింప్స్ తో బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన “శ్రీదేవి సోడా సెంట‌ర్”

0
4
Sudheer Babu up coming movie Sridevi Soda Center first Glimpse released

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు.

 

ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే అయితే సుధీర్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్రానికి సంబందించి గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ విడ‌ద‌ల‌య్యి అవ్వ‌గానే సోష‌ల్ మీడియా లో ట్రెండ్ అవ్వ‌టం ఈ చిత్రంపై అభిమానుల‌, ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఏరేంజి లో వున్నాయో తెలియ‌జేస్తుంది.

 

ఈరోజు విడుద‌లయ్యిన గ్లింప్స్ లో ప్ర‌తిషాట్ లో ద‌ర్శ‌కుడు విజ‌న్ క్లియర్ గా క‌నిస్తుంది. సుధీర్‌బాబు ని కొత్త కొణం లో లైటింగ్ సూరిబాబు గా చూపించారు. ఈ చిత్రంలోని పాత్ర‌ల‌న్నికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Click Here For Sridevi Soda Center Video