“వి” నుంచి రక్షకుడు సుధీర్ బాబు ఫస్ట్ లుక్..!

0
339
Sudheer Babu's first-look poster from 'V' released
Sudheer Babu's first-look poster from 'V' released

(Sudheer Babu’s first-look poster from ‘V’ released, Nani and sudheer babu next movie V latest updates)నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ”వి”.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం సుధీర్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆసక్తి నింపిన చిత్ర యూనిట్..రేపు నాని కి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారట.

కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు.. “రాక్షసుడు” ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు . “రక్షకుడు” వస్తున్నాడు.. అంటూ ప్రకటించిన టీమ్.. సోమవారం ఉదయం ఈ సినిమాలోని ‘రక్షకుడు’ సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో గన్‌తో గురివైపు తీక్షణంగా చూస్తున్న సుధీర్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది. జనవరి 28 ఉదయం 10 గంటలకు ‘రాక్షసుడు’గా నాని ఎలా ఉండబోతున్నాడో చూపించనున్నారు. ఉగాది కానుకగా మార్చ్ 25న ‘వి’ చిత్రం విడుదల కానుంది.

 

 

Previous articleKGF 2 update: Yash final phase of shooting
Next article‘శ్రీకారం’ నుంచి శర్వానంద్ ఫస్ట్ లుక్!