జీఎస్టీ అధికారుల సోదాలపై అనసూయ.. సుమ.. వివరణ

0
154
suma and anasuya responded on GST Raids
suma and anasuya responded on GST Raids

(suma and anasuya responded on GST Raids) కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో జీఎస్టీ అధికారులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టాలీవుడ్ సెలబ్రిటీల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై యాంకర్ సుమ స్పందించారు. తన నివాసంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయని, వాటిలో నిజం లేదని స్పష్టం చేశారు. తన నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.

తాజాగా యాంకర్ అనసూయ కూడా ఇదే జీఎస్టీ అధికారుల సోదాలపై స్పందించింది. మీడియా సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలే తప్ప, వ్యక్తిగత అభిప్రాయాలను అందించరాదని అన్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో సోదాలు జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని, ఒకరి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించకుండా, నిర్ధారణ అయిన తర్వాతే వార్తలు అందించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అనసూయ ఓ ప్రెస్ నోట్ లాంటిది తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here