suma kanakala emotional post on her husband rajeev kanakala

Rajeev Kanakala: Anchor Suma: యాంకర్ సుమ కనకాల.. ఆమె స్టేజ్ ఎక్కిందంటే మామూలుగా ఉండదు. అదరగొడుతుంది అంతే. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకి సంబంధించి కానీ ఇతర పెద్ద కార్యక్రమాలకు కానీ యాంకరింగ్ చేయాల్సి వస్తే సుమ పేరు తప్ప వేరే ఛాయిస్ లేదు. బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఈ మాటల మహారాణి తాజాగా తన భర్త రాజీవ్ కనకాలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సుమ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయని, భర్తతో ఆమె విడాకులు తీసుకుందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను తిప్పికొడుతూ ఆమె ఓ బ్యూటిఫుల్ పోస్ట్ చేసింది.

20 ఏళ్ల క్రిందట రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లాడిన సుమ.. అయితే ఈ మధ్యకాలంలో సుమ దంపతుల గురించి రూమర్స్ రావడంతో అంతా షాకయ్యారు. భర్త రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సరదాగా గడిపిన ఫోటో షేర్ చేస్తూ ”నా ప్రియమైన రాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వే నా బలం, సంతోషం. నా జీవితంలో నువ్వు ఓ వరం. నీ తోడుగా నడిచే ప్రతి అడుగు, ప్రతి రోజు కొత్తగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ” అని పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సుమ తన భర్తకు చెప్పిన విషెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళ కుట్టి అయిన సుమ రాజీవ్ కనకాల ను 1999లో వివాహం చేసుకుంది.

ఎన్నో తెలుగు సినిమాల్లో తనదైన నటనతో అలరించిన రాజీవ్ కనకాల.. రీసెంట్‌గా ”సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచి వాడవురా” సినిమాలతో అలరించారు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు సుమ తనదైన మాటల తూటాలతో బుల్లితెర ఆడియన్స్‌ని చక్కిలిగింతలు పెడుతోంది.