ఫిబ్ర‌వ‌రి 19న సుమంత్ `క‌ప‌ట‌ధారి`

223
sumanth-kapatadhaari-releasing-on-feb19th
sumanth-kapatadhaari-releasing-on-feb19th
 సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌`క‌ప‌ట‌ధారి`.  `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా
చిత్ర నిర్మాత డా.ధ‌నంజ‌యన్ మాట్లాడుతూ “కొత్త క‌థాంశాలతో రూపొందే చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆద‌రిస్తారో అంద‌రికీ తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే క‌ప‌ట‌ధారి నిర్మించాం. సుమంత్‌గారు త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సంప‌త్ రాజ్, జ‌య‌ప్ర‌కాశ్‌, నందిత అందరి పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌ప‌ట‌ధారి సినిమాను రూపొందించాం. చాలా ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న భారీగా విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.
న‌టీన‌టులు:
సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌
యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌
మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌
ఆర్ట్‌:  విదేశ్‌
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌
మాట‌లు:  బాషా శ్రీ
స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌
క‌థ‌:  హేమంత్ ఎం.రావు
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా