సందీప్ కిషన్ “Gully Rowdy” థియేటర్ల లోనే..!

0
38
Gully Rowdy is slated to release in theatres on May 21.

Sandeep Kishan Gully Rowdy: ‘ప్రస్థానం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan).. ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ ‘బీరువా’ ‘నిను వీడని నీడను నేను’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ (Gully Rowdy).

నేహా శెట్టి (Neha Shetty) హీరోహీరోయిన్లుగా ‘గల్లీ రౌడీ’ తెరకెక్కుతోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల విషయం లో నటుడు సందీప్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్లీ రౌడీ ఫన్ మసాలా ఎంటర్ టైనర్ అంటూ చెప్పుకొచ్చారు. థియేటర్ల లో చూడాల్సిన సినిమా అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలకు మద్దతు గా ఉండేందుకు ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గతంలో సందీప్ కిషన్ – బాబీ సింహా కాంబినేషన్ లో వచ్చిన ‘రన్’ అనే సినిమా థియేటర్లలో వారం రోజులు కూడా రన్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.