Sundeep Kishan denies rumours of starring in Uday Kiran biopic
Sundeep Kishan denies rumours of starring in Uday Kiran biopic

ఉదయ్ కిరణ్.. ఎటువంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో తనకంటూ పెద్ద మార్కెట్ ఏర్పరచుకుని.. స్టార్ హీరోల లీగ్ లో ప్రవేశించే సమయంలో వరుస ప్లాప్ లు.. కొన్ని సినిమాల్లో మేటర్ ఉన్నా కూడా థియేటర్లు దొరక్కపోవడంతో సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోతూ వచ్చాయి. ఇటువంటి తరుణంలో అతడు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకొని స్నేహితుల్లోనూ, అభిమానుల్లోనూ తీరని దుఃఖాన్ని నింపేశాడు. ఇప్పటికీ టీవీల్లో ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తే.. ఎలా ఉండేవాడు.. ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంటూ ప్రతి ఒక్కరు బాధపడతారు.

ఉదయ్ కిరణ్ బయోపిక్ ను రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. గతంలో ఇందుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఉదయ్ కిరణ్ బయోపిక్ టాపిక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ క్యారెక్టర్ కోసం సందీప్ కిషన్ ను అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో తాను చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోందని.. ఈ ప్రాజెక్టును గురించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ వార్తలో నిజం లేదనీ.. బయోపిక్ లు చేయాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. సందీప్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటిస్తున్నాడు. హాకీ నేపథ్యంలో సాగబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ గాడి తప్పడానికి ఓ బడా ఫ్యామిలీ ఉందని పుకార్లు వచ్చాయి. ఆ స్టార్స్ ను నెగటివ్ గా చూపిస్తే టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం కష్టమేనని.. అందుకే ఉదయ్ కిరణ్ బయో పిక్ రూపొందించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.