సందీప్ “గల్లీ రౌడీ” రిలీజ్ డేట్ ఫిక్స్..!

Gully Rowdy: టాలీవుడ్ సినిమాల నుంచి రిలీజ్ డేట్ల కన్ఫర్మేషన్ పర్వం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు కూడా ఎన్నో సినిమాలు ఇప్పుడు తమ కొత్త రిలీజ్ డేట్లను ప్రకటించుకోవడంతో పాటుగా ఒక్కక్కటిగా రిలీజ్ కూడా అవుతున్నాయి. సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

‘గల్లీ రౌడీ’ సెప్టెంబర్ 3న నవ్వుల దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు, సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

 

Related Articles

Telugu Articles

Movie Articles