‘మోసగాళ్లు’ సునీల్ శెట్టి పవర్ ఫుల్ క్యారక్టర్ టీజర్..!

0
372
Suniel Shetty Teaser from Mosagallu telugu movie

Mosagallu Suniel Shetty Teaser: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘మోసగాళ్లు’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం.. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మోసగాళ్లు’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఏసీపీ కుమార్‌గా ఐటీ కుంభకోణానికి సంబంధించిన నిందితులను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.

ఇందులో కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా కనిపిస్తుండటం విశేషం. అతి పెద్ద ఐటీ స్కామ్ నిందితులను పట్టుకునే పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. ఈ టీజర్ లో ‘నా జోన్ లో ఎవడైనా తప్పు చేస్తే వాడి లైఫ్ ఇంక డేంజర్ జోనే..వాడు ఎంత తోపైనా నేను వదిలిపెట్టను’ అంటూ సునీల్ శెట్టి పవర్ ఫుల్ డైలాగ్ చెప్తున్నాడు. దీనికి సామ్ సీఎస్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర, నవదీప్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తున్నారు.