‘కనబడుటలేదు’ టీజర్: డిటెక్టివ్ గా సునీల్..!

0
71
Sunil Kanabadutaledu Teaser Talk

Sunil Kanabadutaledu Teaser: సునీల్ – సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం ‘కనబడుటలేదు’. ఎమ్.బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీలో విడుదల చేయనున్నారు.  తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ క్రమంలో సినిమా టీజర్ ను తాజాగా పాపులర్ హీరోయిన్ శ్రీ దివ్య రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేసారు. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’.. అంటూ కీలకమైన కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తున్న సునీల్‌ను పరిచయం చేశారు. 

దర్శకుడు బలరాజు కథను వివరించడానికి ఒక విలక్షణమైన మార్గాన్ని ఎంచుకున్నాడని టీజర్ తో తెలుస్తోంది. ‘ఈరోజుల్లో ప్రేమ పెళ్లి ఆడవారికి సెక్యూరిటీని ఇస్తుంది.. కానీ మగాడికి ఇన్సెక్యూరిటీని ఇస్తుంది’ అనే డైలాగ్ ఆలోచిపజేస్తోంది. ఈ మధ్య కాలంలో హీరోగా సునీల్‌కి ఆశించిన విజయాలు దక్కడం లేదు. మరి ఈ చిత్రంతో అయినా భారీ హిట్ అందుకుంటాడేమో చూడాలి. 

సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ – శ్రీ పాద క్రియేషన్స్ – షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

Watch Here For Sunil Kanabadutaledu Teaser