ఆసక్తి రేపుతున్న సునీల్ ‘కనబడుట లేదు’ మూవీ పోస్టర్

205
sunil-upcoming-kanabadutaledu-movie-new-poster
sunil-upcoming-kanabadutaledu-movie-new-poster

తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఆతర్వాత హీరోగా మారి అలరించారు. దర్శకధీరుడు రాజమౌళి సునీల్ ని హీరోగా మార్చి మర్యాద రామన్న సినిమాను తెరకెక్కించాడు.

 

ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సునీల్ పలుసినిమాల్లో హీరోగా చేసాడు కానీ అనుకున్నంత విజయం సాధించలేక పోయాడు. దాంతో విలన్ గా అవతారమెత్తాడు. రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇటీవల ఓటీటీ లో విడుదలై విజయం సాధించిన కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు సునీల్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

 

ఇప్పుడు ‘కనబడుట లేదు’ అంటూ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సునీల్. తాజాగా ఈ సినిమానుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. క్రైమ్ అంశాలతో నిండిపోయింది పోస్టర్. ఓ డైరీ కవర్ పేజీపై రక్తంతో వేసిన వేలిముద్ర ఉండగా..

 

ఆ ఫింగర్ ప్రింట్ మధ్యలో సునీల్ ఫోటో, పక్కన ఓ గన్ ని డిజైన్ చేశారు. ఈ క్రైం థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీ సంస్థ విడుదల చేయనుంది. పోస్టర్ తోపాటు సునీల్ ‘కనబడుట లేదు’ చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులనూ తాము సొంతం చేసుకున్నామని ప్రకటించింది.