ఏప్రిల్ 16న సునీల్ ‘కనబడుటలేదు’ సినిమా

150
sunil-upcoming-movie-kanabaduta-ledhu-releasing-on-April-16th
sunil-upcoming-movie-kanabaduta-ledhu-releasing-on-April-16th

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ‘కనబడుటలేదు’ చిత్రంలో డిటెక్టివ్ రామకృష్ణగా సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుక్రాంత్ వీరెల్ల హీరోగా నటించిన ఈ మూవీలో యుగ్రాం, శశిత కోన, నీలిమ, పతకంశెట్టి సౌమ్యా, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలరాజు దర్శకత్వంలో సరయు తలశిల సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

 

 

మధు పొన్నాస్ సంగీతం అందించారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను తాజాగా ప్రముఖ దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నారు. విశేషం ఏమంటే… అదే రోజున నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ మూవీ కూడా జనం ముందుకు రాబోతోంది. మరి ఈలోగా ఇంకెన్ని సినిమాలు అదే డేట్ ను టార్గెట్ చేస్తాయో చూడాలి.