‘రంగ్ దే‘ నుంచి ‘నీకనులు ఎప్పుడు’ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

275
super star mahesh babu releasing rangde lyrical song
super star mahesh babu releasing rangde lyrical song

యూత్ స్టార్ నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

 

 

ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన  బస్టాండే బస్టాండే ‘ పాట కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ నేపథ్యంలో మరో పాట ని విడుదలకి సిద్దమైయింది ఇప్పుడు మార్చి 4న సాయంత్రం 4:05 కి ‘నీకనులు ఎప్పుడు ‘ అనే పాట ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చెయ్యనున్నారు అని చిత్రబృందం తెలిపింది.

 

 

ఈ పాట కి గాయకుడు సీడ్ శ్రీరామ్ గాత్రం అందించాడు. ‘రంగ్ దే‘ మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.