నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం: అపోలో వైద్యులు

0
1048
Rajinikanth Health Condition repot from apollo doctors

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ శుక్ర‌వారం హై బీపీతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన సంగ‌తి తెలిసిందే . ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంటర్నేషనల్‌ షూట్‌లోని ప్రత్యేక రూమ్‌లో రజనీకాంత్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. రక్తపోటులో హెచ్చతగ్గుల వల్లే రజినీ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

ఆ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు నేడు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ సాయంత్రం వ‌ర‌కు రానున్నాయి అని అపోలో వైద్యులు తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం రజినీ‌కాంత్‌ కుమార్తె సౌందర్య తండ్రి దగ్గరే ఉండి సపర్యలు చేస్తున్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల‌ని ఆయ‌న‌కు సూచించాం. ద‌య‌చేసి ఆసుప‌త్రి వ‌ద్ద‌కు ఎవ‌రు రావొద్ద‌ని మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేస్తున్నాం అంటూ అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. రజినీకి అత్యంత సన్నిహితుడైన నటుడు మోహన్‌బాబు శుక్రవారం అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.