Mahesh Babu Business details: సినిమా సెలబ్రిటీస్ అందరూ తమ వ్యాపారాలు చేసుకుంటూనే సినిమాల్లో నటిస్తూ ఉంటారు. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ అలాగే తమ సొంత బిజినెస్ ని విస్తరించే పనిలో ఉంటారు. వీరిలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతము కొన్ని బ్రాండ్స్ కి అలాగే AMB సినిమా థియేటర్స్ ని రన్ చేస్తున్న విషయం తెలిసింది. బాలీవుడ్ హీరోలకి దీటుగా మహేష్ బాబు ప్రస్తుతం అరడజను పైగా బ్రాండ్ల ప్రమోషన్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.
Mahesh Babu Business details: వీటితో పాటు మహేష్ బాబు నిర్మాతగాను..హంబుల్ కో అనే పేరుతో వస్త్ర వ్యాపారంలో.. వీటితోపాటు ఏషియన్‌తో కలిసి ఫుడ్ బిజినెస్‌లోనూ అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఈ బిజినెస్ ని వేరే ప్రాంతాలకు కూడా విస్తరింప చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ కలిసి AMB మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే అలాగే ఈ మల్టీప్లెక్స్ కూడా బాగానే పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు బెంగుళూరులో AMB సినిమాస్ నిర్మించి, అక్కడికి కూడా మహేష్ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు సమాచారం. బెంగళూరులోని గాంధీ నగర్‌లో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి, త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దీంతో ఏషియన్ సినిమాస్ మరియు మహేష్ బాబుకి చెందిన AMB సినిమాస్ త్వరలో బెంగుళూరు సినీ ప్రేమికులకు కూడా ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించనున్నాయి. మల్టీప్లెక్స్‌లకు బెంగళూరు ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కాబట్టి AMB సినిమాస్ అక్కడ విజయం సాధించడం దాదాపు ఖాయం.

బెంగళూరులోనే కాకుండా AMB సినిమాస్ నీ ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ సిటీలో మల్టీప్లెక్స్‌లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారంట. దీనితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను వెతుకుతున్నారని తెలుస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన వ్యాపారాలను పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు మహేశ్.
ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న SSMB29 షూటింగ్ లో పాల్గొంటారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 13, 2024న విడుదల కానుంది. పూజా హెగ్డే మరియు శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించనున్నారు.