Supreme court dismissed Prabhas Adipurush cases, Big relief to Adipurush makers from the Court, Adipurush movie, Prabhas Salaar movie bookings, Salaar part 1.
ప్రభాస్ నటించిన అన్ని సినిమాల్లో కంటే ఆదిపురుష్ మూవీ ఎక్కువ కాంట్రవర్సీకి గురవడం మనకు తెలిసిందే.. రిలీజ్ కి ముందు ఆ తర్వాత కూడా ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ అలాగే మొదటి టీజర్ నుండే ఈ సినిమాని చాలామంది వ్యతిరేకించారు.. దానితో పాటు సినిమాలో చూపించిన రామాయణాన్ని వక్రీకరించడం కూడా వివాదాస్పదంగా మారింది.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ని రాముడు గా.. అలాగే కీర్తి సనం సీతగా దానితోపాటు సైఫ్ అలీ ఖాన్ ని రావణాసుడుగా చూపించిన విధంగా కూడా ప్రజలకి నచ్చలేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన రచయిత కూడా ఈ సినిమా విడుదలైన తర్వాత చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి.

దేశంలో ఉన్న పలుకోర్టుల్లో ఈ సినిమాపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టు కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే రామాయణం సీరియల్ లో నటించిన శ్రీరాముడు, లక్షణుడు పాత్ర ధారులు, దానితోపాటు ఆంజనేయ పాత్రకి ప్రాముఖ్యత తీసుకువచ్చిన ధారాసింగ్ తమ్ముడు ఆది పురుష టీమ్‌పై సంచనల ఆరోపణలు చేయటంతో ఇది కాస్త సీరియస్ గా మారింది.
అయితే నిన్న సుప్రీంకోర్టులో దీని సంబంధించిన కేసులన్నీ కొట్టేస్తున్నట్టు ఆర్డర్ విడుదల చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇస్తూ “ఒక్కసారి సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకు సంబంధించిన ఏ విషయంలో కూడా ఎటువంటి విచారణ అవసరం లేదంటూ” ఈ కేసులన్నీ కొట్టేస్తున్నట్టు చెప్పడం జరిగింది. దీనితో ప్రభాస్ మేకర్స్ కి ఒక బిగ్ రిలీఫ్ వచ్చినట్టే అయింది.