సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల హోరు

Suresh Productions Is Care Of Address For Future Films
Suresh Productions Is Care Of Address For Future Films

సురేష్ ప్రొడక్షన్స్…మూడు జెనరేషన్స్ కి సుపరిచయమయిన మెగా బ్యానర్ ఇది.దగ్గబాటి వెంకటేష్,రానా ఇద్దరూ హీరోలుగా ఉండడంతో వాళ్ళు నంటించే 90 శాతం సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతాయి.చాలా సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం లో తెరకెక్కుతాయి.

ఇక నాగ చైతన్య,అతన్ని పెళ్లిచేసుకోవడం వల్ల సమంత కూడా సురేష్ ప్రొడక్షన్స్ లో ఇన్ హౌస్ హీరో,హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నారు.ఇప్పుడు రీసెంట్ గా సురేష్ ప్రొడక్షన్స్ లో రానా,సాయి పల్లవి జంటగా విరాట పర్వం తెరకెక్కుతుంది.మరో పక్క వెంకటేష్,చైతు ల కాంబినేషన్ లో వెంకీమామ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ సినిమా రిలీజ్ అయ్యింది.ఇలా ఇంట్లో ఉన్న స్టార్స్ తో సినిమాలు తీసిన ఏడాదికి మూడు నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.ఇక సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కే సినిమాలు కూడా చాలా ఉన్నాయి.

మధుర శ్రీధర్ సురేష్ ప్రొడక్షన్స్ తో టై అప్ అయ్యి సినిమాలు తీశారు.రీసెంట్ గా వచ్చిన ABCD,దొరసాని సినిమాలకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు పడింది.లోపల టర్మ్స్ అండ్ కండిషన్స్,బిజినెస్ లావాదేవీలు ఏంటి అనేది తెలియకపోయినా కూడా వాటికి సురేష్ ప్రొడక్షన్స్ ప్రోడక్ట్ అనే ఫోకస్ అయితే దక్కింది.కానీ ఈ రెండు సినిమాలు సరయిన కమర్షియల్ విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయాయి.ఈ మధ్య కొన్ని సినిమాలకు తమ బ్యానర్ ని వేల్యూ ఎడిషన్ అనే ఫార్మాట్ లో గుడ్ విల్ కోసం ఇస్తున్నారు.పెళ్లిచూపులు సినిమాతో రాజ్ కందుకూరికి,సురేష్ బాబు కి మంచి సింక్ కుదిరింది.మిగతా విషయాలు కూడా సెట్ అవ్వడంతో రాజ్ కందుకూరి ఆ తరువాత నిర్మించిన మెంటల్ మదిలో సినిమాకి కూడా సురేష్ ప్రొడక్షన్స్ తమ బ్యానర్ వేల్యూ యాడ్ చేసింది.ఇక ముందు రాజ్ కందుకూరి నిర్మించే సినిమాలకు కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉండడం అనేది కామన్.

అలాగే రవిబాబు సినిమాలతో కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేట్ అవ్వడం అనేది ఎప్పటినుండో జరుగుతుంది.సినిమాని తీసి దాన్ని రిలీజ్ చెయ్యలేక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని ఆశ్రయించే వాళ్ళకి కూడా అక్కడి నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది.సినిమా టోటల్ రైట్స్ తీసుకుని దాన్ని రిలీజ్ చేస్తుంటారు.కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా తీసుకుంటే ఆ సినిమాని ముందే తీసి,ఫైనల్ అవుట్ పుట్ రెడీ చేసుకుని సురేష్ ప్రొడక్షన్స్ కి వెళ్లారు దర్శక నిర్మాతలు.ఆ సినిమా రానా కి నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్స్ అనే స్టాంప్ పడిపోయింది.చిన్న సినిమా అయినా కూడా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ అయ్యే సినిమాలకు ఆ బ్యానర్ పేరు పడడం వల్ల వెయిట్ పెరుగుతుంది.రీసెంట్ గా మల్లేశం అనే సినిమాని వేరే వాళ్ళు తీసి సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించారు.దాంతో ఆ సినిమాకి కాస్త కంఫర్ట్ ఎడ్జ్ దక్కింది.అలాగే ఈ మధ్య కాంట్రవర్సీ లకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచిన సినిమా ఫలక్ నుమా దాస్.ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమానే.ఇది కూడా వాళ్ళకు లాభాలు అందించింది.ఉయ్యాలా-జంపాల సినిమా నుండి సురేష్ బాబు తన నిర్మాణ సంస్థ ని మల్టీ పర్పస్ గా యూస్ చేస్తున్నారు.దీంతో నెలకు రెండు మూడు సినిమాలయినా సురేష్ ప్రొడక్షన్స్ అనే ప్రెస్టీజియస్ బ్యానర్ అనే కలరింగ్ తో రిలీజ్ అవుతున్నాయి.దీనివల్ల చిన్న సినిమాలకు,మంచి సినిమాలకు బ్యానర్ వేల్యూ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ గా మారుతుంది.