రివ్యూ : ‘బందోబస్త్’ – ఇంట్రస్ట్ గా సాగని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ !

0
290
Bandobast Movie, Bandobast Telugu Review, Surya, Latest Telugu Review
Bandobast Movie, Bandobast Telugu Review, Surya, Latest Telugu Review

విడుదల తేదీ : సెప్టెంబరు 20, 2019
రేటింగ్ : 2.75/5
నటీనటులు : సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా, బోమన్ ఇరానీ తదితరులు.
దర్శకత్వం : కె వి ఆనంద్
నిర్మాత‌లు : సుభాస్కరన్‌ అల్లిరాజా
సంగీతం : హరీష్ జయ్ రాజ్
సినిమాటోగ్రఫర్ : ఎం ఎస్ ప్రభు
ఎడిట‌ర్‌ : ఆంటోనీ

కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, మోహన్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ :

రవి కిషోర్ (సూర్య) ఒక పవర్ ఫుల్ ఆఫీసర్. గతంలో సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా పాకిస్థాన్ కి వెళ్లి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఒక సిన్సీయర్ ఆర్మీ ఆఫీసర్. అయితే అలాంటి రవి కిషోర్ కి గోదావరి ప్రాంతంలో వ్యవసాయం ఎందుకు చేయాల్సి వచ్చింది ? అసలు పీఎం చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) కి ఎలా దగ్గర అయ్యాడు ? ప్రధానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రవి కిషోర్ (సూర్య) ఎలా నియమించబడ్డాడు ? ఈ క్రమంలో అంజలి (సయేషా సైగల్) రవి కిషోర్ తో ప్రేమలో పడుతుంది. ఇక భారత ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) నిజాయితీ గల స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. దేశానికి కీడు చేస్తోన్న వారి పై యాక్షన్ తీసుకోవటానికి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఉగ్రవాదుల దాడిలో ప్రధాని చంద్రకాంత్ వర్మ చనిపోతారు. అసలు ప్రధానిని చంపింది ఎవరు ? దాని వెనుకున్న రహస్యాన్ని రవి కిషోర్ ఎలా ఛేదించాడు ? మహావీర్ (బోమన్ ఇరానీ)కి ప్రధానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరికి రవి కిషోర్ నేరస్థులను పట్టుకున్నాడా ? పట్టుకుంటే ఎలా పట్టుకున్నాడు ? అనేదే మిగతా కథ.

నటీనటులు :

సూపర్ స్టార్ అనే ట్యాగ్ కూడా పట్టించుకోకుండా మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. పీఎం చంద్రకాంత్ వర్మ అనే పాత్రలో ఇన్ వాల్వ్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావం గురించి మరియు నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఇక బాధ్యతగల ఆఫీసర్ గా నటించిన హీరోయిన్ సయేషా తన నటనతో కీలకమైన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన దృశ్యాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక బోమన్ ఇరానీ ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు. ఇక పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఇంట్రస్ట్ ను కూడా బాగా మెయింటైన్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన హీరో ఆర్య కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన ముద్రఖని, పూర్ణ, తమ నటనతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్:

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు కృష్ణ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక కరుణాకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కుస్తీ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు అర్జున్ జ‌న్యా అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత స్వప్న కృష్ణ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథాకథనాలను మాత్రం రాసుకోలేకపోయాడు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. కథా నేపధ్యం మరియు ఆ నేపథ్యంలో పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు.. కథనం విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇంకా కుదించి ఉంటే బాగుండేది.

అలాగే కథకు అవసరం లేని కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించాల్సింది. సినిమాలో యూత్ ఆకట్టుకునే పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదు. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా అనిపించదు. స్క్రిప్ట్ లో బలం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా విషయం లేని యాక్షన్ సీన్స్ కూడా బోర్ కొట్టించడం, అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

మొత్తానికి దర్శకుడు కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు. ఓవరాల్ గా సినిమాను దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

తీర్పు :

సూర్య, మోహన్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కొన్ని యాక్షన్ సీన్స్ తో మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. ఈ సినిమా కథా కథనాలు మాత్రం ఆసక్తి కరంగా సాగకపోగ విసిగిస్తాయి, అలాగే సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బ తీశాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడటం కష్టమే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here