ఒక్క హిట్‌తో పెరిగిన సూర్యా మార్కెట్

0
564
Suriya Market Will Hike With Aakasam Nee Haddura movie Response

Actor Surya: ‘గజినీ’తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ హీరో సూర్య.. ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోవడంతో తెలుగులో సూర్య మార్కెట్ పడిపోయింది. ’24’ సినిమా ఓకే అనిపించినా.. సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. కొద్దిరోజుల క్రితం వచ్చిన ‘ఎన్జీకే’ సినిమా సూర్య మార్కెట్ ని పూర్తిగా తగ్గించేసింది.

దీంతో తెలుగులో సూర్య మార్కెట్‌ పూర్తిగా పోయినట్లే అనుకుంటున్న సమయంతో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ ఆయనకు పునర్జన్మ ఇచ్చింది. అసలు ఈ సినిమా ఓటీటీ విడుదల చేయకుండా థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే మరింత పెద్ద సక్సెస్ అయ్యేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న అమెజాన్ ప్రైమ్ కి ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఊరట కలిగించింది. సూర్య నటన, సుధా కొంగర డైరెక్షన్ సూపర్బ్.. అంటూ కొనియాడుతున్నారు.

ఈ సినిమా విజయంతో ‘సూర్య ఈజ్ బ్యాక్’ అంటూ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘గజినీ’ తర్వాత సూర్యకు ఇదే బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని సర్టిఫై చేస్తున్నారు. సినిమా పేరుకు తగినట్లుగానే సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ విజయం సూర్యకు తెలుగులో మార్కెట్‌ను ఎన్నో రెట్లు పెంచడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Previous articleNaga Chaitanya & Sai Pallavi Love Story Diwali Poster Out
Next articleఆర్ఆర్ఆర్ టీజర్ పాతరికార్డులన్నీ చెరిపేసిన తారక్..!