Suriya Soorarai Pottru To Be Remake In Hindi

డెక్కన్ ఎయిర్‌వేస్ అధినేత జీఆర్ గోపీనాథ్‌ జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘సూరరై పోట్ట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’అనే పేరుతొ విడుదల చేసారు. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా.. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ నెల 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదిక విడుదల అయింది. ఈ చిత్రంలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. విమానయానాన్ని సామాన్య ప్రజానీకానికి దగ్గర చేయాలన్న ప్రయత్నంలో ఓ గ్రామీణ యువకుడు పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

సూర్య నటన సుధా కొంగర టేకింట్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఓటీటీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని..మహేష్ పాత్రలో సూర్య జీవించాడంటూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌తో పండగ చేసుకుంటోంది. దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

ఇందుకోసం హీరో షాహిద్ కపూర్‌తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అతడు సూర్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ వస్తే మిగతా నటీనటులను ఎంపిక చేసి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దక్షిణాదిలో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నారు.