హిందీలో రీమేక్ అవుతున్న సూర్య సూపర్ హిట్ మూవీ..!

0
31
Suriya's Soorarai Pottru to be remade in Hindi

ఓ మోస్తరు సినిమాలను సైతం బాలీవుడ్ వాళ్లు వదలట్లేదు. సౌత్‌లో ఒక సినిమా హిట్టయిందంటే అది రీమేక్ కావాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. తాజాగా హీరో సూర్య నటించిన చిత్రం “సూరరై పొట్ట్రు”. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కాగా, “ఆకాశం నీ హద్దురా” పేరుతో వచ్చి తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.

గత ఏడాది కొవిడ్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ భారీ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు, తమిళ్‌లో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగరనే హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు.

అయితే హిందీలో ఈ చిత్రాన్ని హీరో సూర్య, అబుడాంటియా ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సూర్య పాత్రకి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం మరియు హృతిక్ రోషన్ వంటి హీరోలలో ఒకరిని ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది.