OTT Review: సూర్య జై భీమ్ సినిమా రివ్యూ

0
3461
Surya Jai Bhim Movie Review in Telugu

Surya Jai Bhim OTT Movie Review And Rating
విడుదల తేదీ : నవంబర్ 2, 2021
రేటింగ్ : 3.25/5
నటీనటులు: సూర్య, ప్రకాశ్ రాజ్, లిజోమొల్ జోస్, రావు రమేశ్, రజిషా విజయన్
దర్శకత్వం : టి.జె. జ్ఞానవేల్
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
సంగీత దర్శకుడు: సీన్ రోల్డన్

తమిళ్ ఆక్టర్ సూర్య కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాలు చేశాడు అలాగే డబ్బింగ్ సినిమాలు చేశాడు. కరోనా నేపథ్యంలో లాస్ట్ ఇయర్ ఆకాశమే నీ హద్దురా OTT రిలీజ్ చేసి హిట్ కొట్టాడు, ఇప్పుడు జై భీమ్ అనే సినిమాని మళ్లీ OTT రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో సూర్య లాయర్‌గా కనిపిస్తున్నాడు. నేడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:
సినిమా 1995 బ్యాక్‌డ్రాప్ కాకినాడ‌లో మొద‌ల‌వుతుంది. అక్క‌డున్న జైలు నుంచి కొంద‌రు గిరిజ‌నులు బ‌య‌ట‌కు రాగానే వారిపై త‌ప్పుడు కేసులు బ‌నాయించి త‌ప్పించుకోవ‌డానికి పోలీసులు వాళ్ల‌ని ప‌ట్టుకుపోతారు. ఒక ధనవంతుని ఇంట్లో దోపిడీ జరగ్గా అది రాజన్న చేశాడని పోలీసులు రాజన్నను మరియు అతడి భార్య, కుటుంబసభ్యులను చిత్ర హింసలకు గురిచేస్తారు.

Surya Jai Bhim Movie Review in Telugu

అయితే అక్క‌డున్నఒకాయ‌న మాత్రం చెన్నై హైకోర్టులో ప‌నిచేసే లాయ‌ర్ చంద్రు(సూర్య‌) ద‌గ్గ‌ర‌కు వెళ్లి, అత‌ని సాయంతో త‌న కొడుకుపై అక్ర‌మ కేసు బ‌నాయించారంటూ కేసు వేస్తాడు. సిన‌త‌ల్లికి న్యాయం జ‌రుగుతుందా? అస‌లు రాజ‌న్‌, అత‌ని స్నేహితులు ఎక్క‌డికి వెళ‌తారు? ఏమైపోతారు? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
కథ
సూర్య నటన
లిజోమల్ జోస్
మణికందన్

మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
సీరియస్ నేరేషన్ ఎక్కువ కావడం

నటీనటులు:
మాస్‌ హీరోగా అదరగొట్టిన సూర్య లాయర్‌గా తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. చంద్రు పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో ఆయన పలికిన హావభావాలు మరోస్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గిరిజన దంపతులుగా నటించిన మణికందన్‌, లిజో మోల్‌ జోసేలు ఈ కథకు ఆయువు పట్టు. వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

Surya Jai Bhim Movie Review in Telugu

విచారణాధికారిగా ప్రకాశ్‌రాజ్‌, రాజిషా విజయన్‌, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. కోర్టు సన్నివేశాలు కళ్లకు కట్టారు. సాంకేతికంగా సినిమా బాగుంది.ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటింగ్‌ ఓకే. షాన్‌ రొనాల్డ్‌ సంగీతం బాగుంది.

విశ్లేషణ:
దర్శకుడు జ్ఞాన్‌వేల్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. అయితే, బలమైన సన్నివేశాలు, సంభాషణలు సినిమాను నిలబెట్టాయి. ఇటీవల కాలంలో ఈ తరహా కథలు వెండితెరపై సందడి చేస్తున్నాయి. ‘నాంది’, ‘వకీల్‌సాబ్‌’, ‘తిమ్మరుసు’ ఆ కోవకు చెందినవే. లాయర్‌ అయిన కథానాయకుడు క్లిష్టమైన ఓ కేసును టేకప్‌ చేయడం. దాన్ని పరిష్కరించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించడం, ఈ క్రమంలో ప్రత్యర్థులు వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగడం. చివరకు కోర్టులో ఆధారాలతో నిరూపించి అమాయకులైన వారిని కాపాడటం. ఈ కథలన్నీ ఇలాగే సాగుతాయి.

Also Read: ఆచార్య నుండి సిద్ధ & నీలాంబరి సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్..! 

అయితే సినిమా మొదలు నుంచి చివరి వరకు సూర్య ఎక్కడ కూడా అతిగా చేయకుండా చక్కటి భావోద్వేగాలను కనబరిచాడు. కోర్టు అన‌గానే పేజీల పేజీల డైలాగులు లేకుండా అస‌లు కోర్టు ప్రోసీడింగ్స్ ఎలా జ‌రుగుతాయో అలా సాగేలా ఉండే సినిమాలో లాయ‌ర్ పాత్ర‌. నిజానికి ఇది క‌డ‌లూరులోని జరిగిన లాక‌ప్ డెత్‌లో పోలీసుల‌కు వ్య‌తిరేకంగా కేసు వేసి బాధితుల‌కు న్యాయం చేసిన లాయ‌ర్ చంద్రు పాత్ర‌.

Surya Jai Bhim Movie Review in Telugu

ఇక రావు రమేష్ ప్రభుత్వ లాయర్‌గా కనిపించి తన పాత్రలో చాలా పవర్ ఫుల్‌గా నటించాడు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడి సూర్యకి గట్టిపోటీ ఇచ్చాడు. కోర్టు హాలు సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. ఫ‌స్టాఫ్‌లో తొలి అర‌గంట గిరిజ‌నులు వారి క‌ష్టాలు చుట్టూనే సినిమా ఉంటుంది.

Also Read: Jr NTR and Sanjay Leela Bhansali film titled Jai Bhav Re?

కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం. ఆ సాక్ష్యాలు లేక‌పోతే కేసు చెల్ల‌దు. అలాంటి సాక్ష్యాల‌ను సూర్య ఎలా సంపాదించాడు. డిస్మ‌స్ కావాల్సిన కేసుని ఎలా గెలిపించాడు? అనే అంశాల‌ను స్టెప్ బై స్టెప్ ఆస‌క్తిక‌రంగా ముందుకు న‌డిపారు ద‌ర్శ‌కుడు. ప్రధాన కథలోకి రావడానికి కొంత సమయం పట్టినా, కమర్షియల్ అంశాలు లేకపోయినా కూడా చివరి వరకు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తిగానే అనిపిస్తుంది. చివరగా… జై భీమ్.. ఆకట్టుకునే ఎమోషనల్ కోర్ట్ డ్రామా..హీరో సూర్య కొత్త ప్రయత్నానికి జై కొట్టాల్సిందే.

 

Web Title: Jai Bhim Movie Review In Telugu, Surya Jai Bhim Review Rating, Jai Bhim OTT Review, Amazon Prime Movies, Jai Bhim Telugu Movie review rating..

REVIEW OVERVIEW
CB Desk
Previous articleఆచార్య నుండి సిద్ధ & నీలాంబరి సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్..!
Next articleనాగార్జున ‘బంగార్రాజు’ షూటింగ్ అప్డేట్..!