Surya, Rakul Preet, NGK Movie Review, Tollywood Movie Reviews
Surya, Rakul Preet, NGK Movie Review, Tollywood Movie Reviews

విడుదల తేదీ : మే 31, 2019
రేటింగ్ : 1.5/5
నటీనటులు : సూర్య శివకుమార్,సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు
దర్శకత్వం : సెల్వ రాఘవన్
నిర్మాత : ఎస్ ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు ఎస్ ఆర్
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫర్ : శివకుమార్ విజయన్

గజిని, సెవెన్త్ సెన్స్ లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ని,మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు తమిళ హీరో సూర్య.కానీ గత కొంతకాలంగా సరైన సినిమా డెలివర్ చెయ్యకపోవడంతో అతని మార్కెట్ బాగా దెబ్బతింది.అందుకే కాస్త గ్యాప్ తీసుకుని సెల్వరాఘవన్ లాంటి టేస్ట్ ఫుల్ డైరెక్టర్ తో జతకట్టి NGK అనే పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు.పాలిటిక్స్ అనేది ఈ మధ్య బాగా క్లిక్ అవుతున్న కాన్సెప్ట్ కావడం,సూర్య జడ్జిమెంట్ మీద జనాలకు ఇంకా నమ్మకం తగ్గకపోవడం వంటి కారణాలతో ఎన్జీకే కు మరీ భారీగా కాకపోయినా ఓ మోస్తరు బజ్ క్రియేట్ అయ్యింది.మరి అలా పరవాలేదనిపించే అంచనాలతో ప్రేక్షకుల ముందకు వచ్చిన NGK సూర్య కోరుకున్న హిట్ అందించిందా లేదా..? రొటీన్ గా అనిపించిందా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

బాగా చదువుకుని మంచి జాబ్ చేస్తున్న నందగోపాలకృష్ణ వ్యవసాయం మీద ఇష్టంతో జాబ్ మానేసి సొంత ఊరొచ్చి ఆర్గానిక ఫామింగ్ స్టార్ట్ చేస్తాడు. అతని ఇన్స్పిరేషన్ తో మరికొంత మంది యువకులు కూడా అతన్ని ఫాలో అవుతారు. కానీ లోకల్ గా ఉండే చోటా మోటా గూండాలు అడుగడుగునా నందగోపాలకృష్ణ కు అడ్డుపడుతుంటారు.అయితే పొలిటీషియన్స్ ఒక్క ఫోన్ కాల్ తో వాళ్లను అదుపుచేయగలుగుతారు. అదిచూసిన ఎన్జీకే దేశానికి మంచి జరగాలన్నా, ఊరికి మంచి జరగాలన్నా.. పాలిటిక్స్ లోకి వెళ్లడం కరెక్ట్ అని తాను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఎ లాంటి బ్యాక్ గ్రౌండ్, అనుభవం లేకుడా రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్జీకే సామన్య కార్యకర్త స్తాయి నుంచి సీ.ఎం గా ఎలా ఎదిగాడు అనేదే సినిమా కథ.

నటీనటులు:

ఎలాంటి పాత్ర అయినా తన నటనతో పదిరెట్లు ఎలివేట్ చేసి చూపించే సూర్య.. ఎన్జీకే వరకూ అలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దానికి కారణం కథలో ఎలాంటి ఆకర్షణలు, ఎలాంటి పొటెన్షియల్ డైమెన్షన్స్ లేని పాత్ర కావడం. అయినా కూడా దాన్ని నమ్మి ఒక నటుడిగా ఎంత వరకూ మెప్పించగలడో అంతవరకూ మెప్పించాడు సూర్య. కాకపోతే ఇది సూర్య చెయ్యాల్సిన పాత్ర కాదు ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇక సూర్య భార్యగా నటించిన సాయిపల్లవి కి , పొలిటికల్ పార్టీ పి.ఆర్ టీమ్ లీడర్ గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ కి యాక్టింగ్ లో పెద్దగా స్కోప్ దక్కలేదు. వాళ్ల మద్య సన్నివేశాలు కూడా చాలా సిల్లీ గా అనిపిస్తాయి. మిగిలిన నటీనటులు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం ఉన్నవాళ్లు లేరు. కొంతమంది నటన అతిగా అనిపిస్తుంది.

టెక్నీషియన్స్:

గతంలో.. టేస్ట్ ఫుల్ సినిమాలతో డైరెక్టర్ గా తనకొక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సెల్వరాఘవ ఎన్జీకే కి మాత్రం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మేట్ ని ఎంచుకుని ఆశ్ఛర్యపరిచాడు. అయితే దాన్ని కూడా ఆసక్తికరంగా మలచలేక రొటీన్ దారుల్లో అస్తవ్యస్తంగా సినిమాను నడిపించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శకర్ రాజా ఒక్క గుర్తుపెట్టుకునే ట్యూన్ కూడా ఇవ్వలేకపోయాడు. ఆర్.ఆర్ పరంగా మాత్రం ఓకే అనిపించాడు. కెమెరామెన్ పనితనం కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది. నిర్మాణవిలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి.

ఫైనల్ గా:

కనీసం ఈ సారైనా ఎన్జీకే తో హిట్ కొ్ట్టి తెలుగు మార్కెట్ నిలబెట్టుకోవాలన్న సూర్య ఆశ నెరవేరలేదనే చెప్పుకోవాలి. రొటీన్ టచెస్ ఉన్న పొలిటికల్ థ్రిల్లర్ అయిన ఎన్జీకే బి,సి సెంటర్స్ లో ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబట్టుకోవచ్చు.

పంచ్ లైన్: ఏం జరిగింది కృష్ణా