Sushanth ‘Ichata Vahanamulu Nilupa Radu’ Shooting completed, ready to release

Sushanth ‘Ichata Vahanamulu Nilupa Radu’: “అలా వైకుంఠ పురములో” వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సుశాంత్ తాజాగా మరో డిఫరెంట్ కాన్సెప్టుతో ఆడియెన్స్ ని అలరించడానికి వస్తున్నారు. సుశాంత్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎస్. దర్శన్ డైరెక్షన్ లో ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తోన్న చిత్రం “ఇచ్చట వహణములు నిలపరాదు” ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌.

సెప్టెంబ‌ర్ 20 న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. గేర్ మార్చి బండి తియ్ అనే క్యాప్ష‌న్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.. అంత‌కుముందు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని దర్శక నిర్మాతలు తెలియ‌జేశారు. ఈ చిత్రం ఒక పాట మినహా టాకీ పూర్తిచేసుకుంది.. ఆ బ్యాలెన్స్ ఉన్న పాటను అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. తొందరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. సరికొత్త క్యారెక్టర్ తో ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సుశాంత్ కాన్ఫిడెంట్ తో ముందుకు వస్తున్నారు.

తారాగ‌ణం:
సుశాంత్‌, మీనాక్షి చౌధ‌రి, వెంక‌ట్‌, వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య‌, నిఖిల్ కైలాస‌, కృష్ణ‌చైత‌న్య‌

సాంకేతిక బృందం:
సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
సినిమాటోగ్ర‌ఫీ: ఎం. సుకుమార్‌
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
సంభాష‌ణ‌లు: సురేష్ భాస్క‌ర్‌
ఆర్ట్‌: వి.వి., పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
నిర్మాత‌లు: ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల
ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌. ద‌ర్శ‌న్‌