Homeసినిమా వార్తలుసుశాంత్ సింగ్ – రియా కలిసి గాంజాయి వైరల్ అవుతున్న వీడియో

సుశాంత్ సింగ్ – రియా కలిసి గాంజాయి వైరల్ అవుతున్న వీడియో

Sushanth Singh and Rhea smoking video: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు ఎవరూ ఊహించని విధంగా అనేక మలుపులు తిరుగుతోంది. మొదట్లో సుశాంత్‌ మృతికి రియానే (Rhea Chakraborty) కారణమని ఆరోపిస్తూ ఆమెపై కేసులు నమోదు చేశారు. తరువాత ఇందులో మనీ లాండరింగ్‌, డ్రగ్స్‌ కోణాలు కూడా ఉండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)లు విడివిడిగా ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి.

ఈ క్రమంలోనే ఎన్‌సీబీ ఇటీవలే రియాతోపాటు ఆమె సోదరుడు షౌవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాలను అరెస్టు చేసింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వేసిన బెయిల్ పిటిషన్ మరోసారి కొట్టివేయబడింది. దీంతో ఆమె 14 రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ గతంలో గంజాయి సిగరెట్లు తాగుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మీడియా సంస్థ ఈ వీడియోను సేకరించగలిగింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. ఆ వీడియోలో రియా చక్రవర్తి, సుశాంత్‌ సింగ్‌ ఇద్దరూ గంజాయి సిగరెట్లు తాగుతూ కనిపించారు. అందులో రియా.. రోల్డ్‌ సిగరెట్‌.. అని అంటుండడం గమనించవచ్చు. ఇక అందులోనే ఉన్న మరొక వ్యక్తి.. చరస్‌.. అని, హెర్బల్‌ స్టిక్స్‌ అని అంటుండడాన్ని కూడా చూడవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY