రవితేజ ‘రావణాసుర’ నుంచి సుశాంత్ ఫస్ట్ లుక్ విడుదల…!!

0
3269
Sushanth's first look from Ravi Teja starrer Ravanasura
Sushanth's first look from Ravi Teja starrer Ravanasura

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవితేజ 70వ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్ అనే ముఖ్య పాత్రలో సుశాంత్ నటించనున్నారు. అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుశాంత్.. రావణాసుర కథ, స్క్రిప్ట్, పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పారు. సుశాంత్ అప్పియరెన్స్ ఈ సినిమాకు బోనస్ కానుంది.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుశాంత్ నీలిరంగు కళ్లతో, పొడవాటి జుట్టుతో, స్టైలీష్ లుక్‌లో కనిపించారు. రామ్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు.. హీరోలు లేరు అనే క్యాప్షన్‌తో సినిమా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోస్టర్‌ను చూస్తుంటే సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు కనిపిస్తోంది.

దీపావళి సందర్భంగా విడుదల చేసిన రవితేజ పోస్టర్‌లో న్యాయవాది గెటప్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతోన్నారు. ఈ నెలలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

Sushanth's first look Poster from Ravi Teja starrer Ravanasura
Sushanth’s first look Poster from Ravi Teja starrer Ravanasura

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.

కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు.

Previous articleKeerthy Suresh Tested Positive For COVID 19
Next articleSushanth first look from Ravi Teja starrer Ravanasura