సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సెన్సార్ పూర్తి

0
60
Sushanth’s Ichata Vahanamulu Niluparadu Awarded With UA Censor Certificate

Ichata Vahanamulu Niluparadu: సుశాంత్ తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను ఎక్కువ‌గా చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొంది ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ఫ్రెష్ కంటెంట్‌, యాక్ష‌న్‌, రొమాన్స్ స‌హా ఇత‌ర అంశాల‌తో ఇచ్చ‌ట వాహ‌న‌ములు చిత్రాన్ని కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన చిత్ర యూనిట్‌ను సెన్సార్ స‌భ్యులు అభినందించారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌కు, రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది.

Ichata Vahanamulu Niluparadu Movie Review and rating

లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.