సుశాంత్ `ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు` రిలీజ్ డేట్ ఫిక్స్..!

0
426
Sushanth’s Ichata Vahanamulu Niluparadu To Release On August 27th

Ichata Vahanamulu Niluparadu Release Date: వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ టాలీవుడ్ తన‌దైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరో సుశాంత్ గ‌త ఏడాది అల్లుఅర్జున్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హిలేరియ‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు` చిత్రంతో ఆగ‌స్ట్ 27న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు.

ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన `ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు` చిత్రం విడుద‌ల తేదిని ఆగ‌స్ట్ 27గా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ అయ్యాయి. అదే విధంగా, సెకండ్ వేవ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాల‌ను స‌క్సెస్ చేస్తున్నారు. వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు.

Sushanth’s Ichata Vahanamulu Niluparadu Release date

ఇప్పుడు వైవిధ్య‌మైన‌ థ్రిల్లర్‌గా రూపొందిన `ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు` చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సుశాంత్ జోడీగా మీనాక్షి చౌద‌రి న‌టించ‌గా, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గౌత‌మ్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్రలలో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వుల‌ను పంచ‌నున్నారు.

ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.