Homeసినిమా వార్తలువిడాకులు పై స్పందించిన కలర్ స్వాతి.!

విడాకులు పై స్పందించిన కలర్ స్వాతి.!

Colors Swathi about her divorce issue, Swathi responds rumors about marriage divorce, Colors Swathi Gives Clarity On Divorce, Month of Madhu movie streaming date, Sai Dharam Tej, Swathi upcoming movie news

స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ యాంకర్ గా మొదలుపెట్టిన తన కెరీర్ ని తర్వాత సినిమాల్లో హీరోయిన్గా అంచులంచును ఎదుగుతూ వచ్చింది.  అష్టా చమ్మా అలాగే కార్తికేయ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ లో.  మ్యారేజ్ చేసుకున్న తర్వాత సినిమాలు కి దూరంగా ఉంటూ ఇప్పుడు మళ్ళీ సాయి ధరమ్ తేజ్ తో నటించిన మంత్ ఆఫ్ మధు సినిమాతో మన ముందుకు రాబోతుంది. 

అయితే కొన్ని రోజులుగా కలర్స్ స్వాతి విడాకులు (Swathi Divorce) తీసుకున్నట్టు సోషల్ మీడియాలో అలాగే వెబ్ మీడియాలో కథనాలు నడిచాయి.  స్వాతి ఈ విడాకుల మీద స్పందించలేదు కానీ మంత్ ఆఫ్ మధు మూవీ  ప్రమోషన్ లో భాగంగా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అదే సమయంలో తన విడాకుల గురించి ప్రస్తావించగా.. స్వాతి మాత్రం తెలివిగా స్పందించింది. 

మీ విడాకులు గురించి చెప్పండి అని అడగగా… “నేను చెప్పను కానీ నా కెరియర్ మొదలుపెట్టినప్పుడు సోషల్ మీడియా ఇంతగా ప్రచారంలో లేదు కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వారు వీటన్నిటిని ఎలా తట్టుకుంటున్నారో తెలియదు.. కానీ నటిగా నాకు కొన్ని రూల్స్ ఉన్నాయంటూ వాటిలో “నేను చెప్పను” అనేది ఒక రూల్ అని తెలివిగా తప్పించుకోవటం జరిగింది. 

ఇక మంత్ ఆఫ్ మధు సినిమా గురించి మాట్లాడుతూ..తాను ఈ మూవీలో లేఖ అనే పాత్ర పోషించినట్లు చెప్పారు.. ఈమధ్య తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తగ్గాయని.. ఇక సాయి ధర్మతేజ్ నాకు ఒక స్నేహితుడు.. అలాగే ఇద్దరం బిఎస్సి కలిసి చదువుకున్నాము తను నాకు చాలా సపోర్టుగా ఉండేవాడు అని చెప్పుకు రావటం జరిగింది.  తన లైఫ్ లో సాయిధరమ్ తేజ్ సపోర్ట్ సిస్టమ్ అని పేర్కొన్నారు. ఈ మంత్ మధు మూవీలో నవీన్ చంద్రకు జోడిగా ఆమె నటించడం విశేషం.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY