Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office
Megastar Chiranjeevi Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office

షార్ప్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రగా నటిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ లో కూడా ఈ చిత్రం పై భారీ క్రేజ్ ఉంది.

యూఎస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తీరు చూస్తుంటే.. కొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సైరా అడ్వాన్స్ బుకింగ్స్ $ 400000 లకు చేరాయని తాజా సమాచారం. సైరా అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి ఫస్ట్ వీక్ లోనే సైరా వన్ మిలియన్ ను ఈజీగా చేరుకుంటుందని అంచనా. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఎప్పుడో పదేళ్ల క్రితమే పరుచూరి బ్రదర్స్ ‘సైరా’ స్క్రిప్ట్ ను రాశారు. సైరా స్క్రిప్ట్ ఓ రేంజ్ లో ఉంటుందని.. సినిమా ఎలాగూ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటుందని.. అలాగే స్క్రిప్ట్ పరంగా కూడా ఆకట్టుకోబోతుందని తెలుస్తోంది.

కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించాల్సిందట. కానీ, కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ సైరాలో నటించలేదట. ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

 

Megastar Chiranjeevi’s Sye Raa Narsimha Reddy is getting awesome response in advance booking at the USA box office. Surender Reddy’s movie collected $400000 in 199 locations in its pre-sales.