Syed Abdul reaction on Sai dharam tej Comments: సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వీరూపాక్ష సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. 2021 లో బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చిన సినిమా ఇదే. మాదాపూర్ లో బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ గాయాల నుండి కోలుకొని కెమెరా ముందుకు రావడానికి సాయికి చాలా రోజులు పట్టింది. అయితే ఈ యాక్సిడెంట్ నుంచి సాయి ధరమ్ తేజ్ ని కాపాడిన సయ్యద్ ఇప్పుడు షాపింగ్ కామెంట్ చేయడం జరిగింది.
Syed Abdul reaction on Sai dharam tej Comments: విరుపాక్ష ప్రమోషన్ టైం లో సాయి ధరమ్ తేజ్ తనను కాపాడిన వ్యక్తికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా తాను చేస్తానంటూ అలాగే తన ఫోన్ నెంబర్ కూడా సయ్యద్ కి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే సాయి చెప్పిన దానికి విరుద్ధంగా బయట సయ్యద్ పరిస్థితి ఉంది. బైక్ యాక్సిడెంట్ నుంచి కాపాడిన సయ్యద్ ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అసలు విషయానికి వెళ్తే..
దీనికి సంబంధించి ఒక మీడియా సంస్థ విషయాలు తెలుసుకుందామని సయ్యద్ ని కలవడం జరిగింది. అయితే ఇక్కడే నిజాలు బయటపడ్డాయి, మరి ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. సయ్యద్ చెప్పిన దాని ప్రకారం, తను హైదరాబాదులోని CMR షాపింగ్ మాల్ లో చేస్తూ ఉండే వాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు తన దగ్గరకు వచ్చి మెగా ఫ్యామిలీ ఎలాంటి సహాయం చేశారు అలాగే ఏమైనా డబ్బులు ఇచ్చారా అంటూ అడిగేవారు అంట.. ఆ టార్చర్ తట్టుకోలేక అక్కడ జాబ్ కూడా మానేసినట్టు చెబుతున్నారు..
అలాగే మెగా ఫ్యామిలీ గాని సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కానీ తనకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదని.. తను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదని షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తాను అమెజాన్ కోసం పని చేస్తున్నాడట. మరి దీనిపై సాయి ధరమ్ తేజ్ కానీ లేదంటే తన PR టీం కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.