తాప్సీ సినిమాకి దర్శకుడిని మార్చేశారా..?

0
11
taapsee pannu next Shabaash Mithu diretor changed

Shabaash Mithu: బాలీవుడ్​లో వరుస చిత్రాలతో బిజీగా మారింది స్టార్​ హీరోయిన్​ తాప్సీ. సవాళ్లు విసిరే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్​ క్రీడాకారిణి మిథాలీ రాజ్​ జీవితకథతో ‘శభాష్​ మిథు’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి డైరెక్టర్‌ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా  తెరకెక్కుతున్న ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన పలు సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లోని విశేషాలను ఇందులో చూపించనున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్‌ను చేంజ్ చేస్తున్నట్టు సమాచారం. 

రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ తాజాగా సమాచారం మేరకు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ ఎంటరయ్యారట. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కాబోతోన్న తరుణంలో దర్శకుడు మార్పు వార్తలు బిటౌన్ లో చర్చకు తెరలేపాయి. మహిళల క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న మిథాలీ పాత్రలో నటించేందుకు తాప్సి క్రికెట్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు.