సీటీమార్‌ లో కబడ్డి కోచ్ త‌మ‌న్నా ఫస్ట్ లుక్

Tamanna First Look Poster From Gopichand SeetiMaarr film
Tamanna First Look Poster From Gopichand SeetiMaarr film

(Tamanna First Look Poster From Gopichand next SeetiMaarr movie) మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రంసీటీమార్‌. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డి గా మిల్కీబ్యూటి తమన్నా లుక్ ని ఈరోజు ఉదయం 9:24 నిమిషాలకి విడుదలచేసింది చిత్ర యూనిట్.

Tamanna First Look Poster From Gopichand SeetiMaarr movie
Tamanna First Look Poster From Gopichand SeetiMaarr movie

జ్వాలా రెడ్డిగా తన లుక్‌‌పై తమన్నా మాట్లాడుతూ.. ‘‘చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తిమంతమైన, ఛాలెంజింగ్ రోల్ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి. గోపిచంద్‌తో మొదటిసారి క‌లిసి నటిస్తున్నాను. అలాగే, సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ తర్వాత చేస్తోన్న సినిమా ఇధి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బేనర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘రాజ‌మండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆర్ఎఫ్‌సీలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. ఈ షెడ్యూల్‌లో తమన్నా జాయిన్ అయ్యారు. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్, భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. సంపత్ నంది హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు’’ అని వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో దిగంగన సూర్యవన్షి, తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.